తాగునీటి పైపు లైన్ లీకేజ్‌కు మరమ్మతు పనులు ప్రారంభం
ATP: పామిడి శివారులో గుత్తి మున్సిపాలిటీకి తాగునీరు సరఫరా చేసే పైప్ లైన్ లీకేజ్‌కు మంగళవారం మున్సిపాలిటీ సిబ్బంది మరమ్మతు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. మరమ్మతుల కారణంగా గుత్తి పట్టణానికి వచ్చే రెండు రోజులు తాగునీటి సరఫరా నిలిపివేస్తామని చెప్పారు.