VIDEO: గ్రామసభలో అధికారులను నిలదీసిన ప్రజలు

VIDEO: గ్రామసభలో అధికారులను నిలదీసిన ప్రజలు

MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ రసాభాసగా మారింది. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపిక సందర్భంగా అర్హత లేని వారికి మంజూరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.