VIDEO: పెసరపప్పు సీఎం చిత్రపటం
SDPT: సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా గజ్వేల్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు, జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు తన అభిమానాన్ని చాటుకున్నారు. పెసరపప్పును ఉపయోగించి రేవంత్ రెడ్డి చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. భగవంతుడు తనకిచ్చిన కళతో ఎంతోమంది నాయకుల చిత్రాలను చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు.