రోడ్డు ప్రమాదంలో రెండు గేదెలు మృతి

రోడ్డు ప్రమాదంలో రెండు గేదెలు మృతి

బాపట్ల: కర్లపాలెం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జాతీయ రహదారిపై నూతనంగా నిర్మిస్తోన్న పెట్రోల్ బంక్, ఉమ్మారెడ్డి వెంచర్ సమీపంలో వేగంగా వచ్చిన కారు, రోడ్డుపైకి వచ్చిన రెండు గేదేలను ఢీకొట్టింది. దీంతో గేదేలు అక్కడికక్కడే మృతి చెందాయి. ప్రమాదం తర్వాత కారు ముందు భాగం ధ్వంసమైంది.