మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి: ఛైర్‌పర్సన్
GNTR: తెనాలి 22వ వార్డులోని మఠంబజార్ మున్సిపల్ స్పెషల్ ఎలిమెంటరీ స్కూల్‌ను ఛైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక సందర్శించారు. ఆమె పాఠశాలలోని తరగతి గదులను, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని బుధవారం పరిశీలించారు. తరగతి గదులకు కిటికీలు, విద్యుత్ సరఫరా చేయాల్సిందిగా మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులను ఆమె ఆదేశించారు.