ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

NDL: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి శుక్రవారం వేల్పనూరులో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించి, పలు సమస్యలను అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలకు త్వరిత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.