ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట

KDP: సిద్దవటం మండలంలోని లింగంపల్లి, మాచుపల్లె గ్రామాల్లోని పెన్నా నది నుంచి అనుమతులు లేకుండా అక్రమార్కులు ఇసుకను తరలిస్తుండడంతో స్థానిక ప్రజలు ఎక్స్ కవేటర్ సహాయంతో టక్కోలి పెన్నా నదికి వెళ్లే రహదారి వద్ద గోతులు తీశారు. ఇసుకను తరలించడం వల్ల భూగర్భ జలాలు అట్టడుగు ప్రాంతాలకు పోవడంతో పంట పొలాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.