పుంగనూరులో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
CTR: మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఆదివారం పుంగనూరులో టీడీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. గోకుల్ సర్కిల్లో NTR విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.