మంత్రికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి
ATP: జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నడిమివంకలకు రక్షణ గోడలు లేకపోవడంతో వర్షాకాలంలో కాలనీలు మునిగే ప్రమాదం ఉందని అలాగే ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణం అత్యవసరమని కోరుతూ ఇప్పటికే అంచనాల నివేదికలను సమర్పించినట్లు మంత్రికి ఆయన వినతి పత్రం అందజేశారు.