'సూర్యనమస్కారాలతో ఎన్నో లాభాలు'

SKLM: ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష నారాయణ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. నగరంలోని అరసవల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో సూర్యనమస్కారాలను జిల్లా అధికారులు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యోగాసనాలతో స్ఫూర్తి నింపారు.