అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన MLA

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన MLA

GNTR: పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రేషన్ కార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు, 22ఏ భూములు, గ్రామ, పట్టణాల్లోని ఇళ్ల పట్టాలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ పాల్గొన్నారు.