మెగాజాబ్ మేళాకు భారీగా యువత
కృష్ణా: గుడివాడ కేటీఆర్ మహిళా కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగాజాబ్ మేళా శుక్రవారం విజయవంతంగా జరిగింది. జాబ్‌మేళాలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు అందించాలనే సంకల్పంతో మెగాజాబ్ మేళాలు నిర్వహించడం అభినందనీయమని కళాశాల ఛైర్మన్ నిర్మల అన్నారు.