గుర్లలో భారీ వర్షం

విజయనగరం: గత కొద్దిరోజులుగా వడగాల్పులు, ఎండ వేడికి సతమతమవుతున్న ప్రజలకు మంగళవారం ఉదయం గుర్ల మండలంలో కురిసిన భారీ వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించింది. మంగళవారం భారీ వర్షం గంటసేపు కురిసి ఊరటనిచ్చింది. తుఫాను ప్రభావంతో మరో 4 రోజులు పాటు ఉరుములు, మెరుపులుతో కూడిన భారీ వర్షాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ తెల్పింది.