గుండె పోటుతో మరిపెడ ఏఎస్సై మృతి

MHBD: విధి నిర్వహణలో ఉన్న ASI గుండెపోటుతో మరణించిన ఘటన మరిపెడలో చోటు చేసుకుంది. ASI మూడ్ హనుమంతు నాయక్ (55) ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ రావడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం వారి స్వగ్రామమైన మర్రిగూడెంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.