చింతపల్లి సాయిబాబాను దర్శించుకున్న మంత్రి

NLG: చింతపల్లిలోని శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయాన్ని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవరకొండ పట్టణం, చందంపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు వెళుతూ మార్గమధ్యంలో సాయిబాబాను దర్శించుకున్నారు.