అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

VZM: రామభద్రపురం మండలంలోని తారాపురం గ్రామంలో గురువారం తుమరాడ శ్యామల (41) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తెల్లవారుజామున పురుగుమందు తాగిన ఆనవాళ్లు గుర్తించామన్నారని ఏఎస్సై అప్పారావు తెలిపారు. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.