చింతలమోరి బీచ్‌లో బాలుడు గల్లంతు

చింతలమోరి బీచ్‌లో బాలుడు గల్లంతు

కోనసీమ: మలికిపురం మండలం చింతలమోరిలో సముద్రంలో స్నానానికి దిగి బాలుడు గల్లంతయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన తెన్నేటి మహిమ రాజు(14) ఆదివారం ముగ్గురు స్నేహితులతో కలిసి చింతలమోరి బీచ్‌లో స్నానానికి దిగాడు. కెరటాలకు సముద్రంలోకి కొట్టుకు పోయాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.