'భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

'భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

GDWL: రాష్ట్రంలో మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.