కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన బొత్స కుటుంబం

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన బొత్స కుటుంబం

VZM: గత సంవత్సరం చెల్లూర వద్ద వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన సిద్ధం సభకు విచ్చేసిన గరివిడి, శేరిపేట గ్రామానికి చెందిన తెలుగు తౌడు బైక్ యాక్సిడెంట్‌లో మృతి చెందారు. దీనికి గాను శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు వారి కుమార్తె అనూష ఇవాళ తౌడు కుటుంబానికి 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. వారి కుమారుడికి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు.