ప్రొద్దుటూరు 1-టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరణ

ప్రొద్దుటూరు 1-టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరణ

KDP: ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐగా శ్రీరామ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కర్నూల్ జిల్లా ఆదోని నుంచి ఆయన ఇక్కడికి బదిలీ అయ్యారు. గతంలో ఇక్కడి సీఐగా ఉన్న తిమ్మారెడ్డి కడప వీఆర్‌కు బదిలీ అయ్యారు. ఈనెల 14న డీఐజీ కోయ ప్రవీణ్ సీఐల బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న ప్రొద్దుటూరు 2-టౌన్ సీఐగా వంశీనాథ్, 3 టౌన్ సీఐగా రామాంజనేయుడు కూడా బాధ్యతలు స్వీకరించారు.