సైబర్ నేరలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

SDPT: బెజ్జంకిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం ఎస్సై బోయిని సౌజన్య ఆధ్వర్యంలో 'సైబర్ జాగృకత దినోత్సవం' సందర్భంగా ప్రత్యేక సైబర్ నేరలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆధునిక డిజిటల్ ప్రపంచంలో ఎదురయ్యే సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌లో పార్ట్ టైం జాబ్స్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని విద్యార్థులకు తెలియజేశారు.