RTC బస్సు-లారీ ఢీ.. ఒకరు మృతి
TG: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర బస్సును ఓ లారీ ఢీ కొట్టి.. బస్సుపై పడిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.