గోవింద్ అభినవ్ మృతిపై అనుమానాలు
రాజన్న సిరిసిల్ల వేములవాడలో గోవింద్ అభినవ్ (25) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఓ మురికి కాల్వలో మృతదేహం లభ్యమైంది. ఈ ఆకస్మిక మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండగా పోలీసులు విచారిస్తున్నారు. రాజన్న ఆలయంలో దినసరి కార్మికుడైన మృతుడు, ఇటీవల గోదాం సరుకుల తరలింపులో కీలకంగా ఉన్నాడు.