రోడ్డుపై నిద్రించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్
KNR: పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యా యి. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో జరుగుతున్న 24 గంటల నిరసన దీక్ష బుధవారానికి 16వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కార్యకర్తలతో కలిసి దీక్షా శిబిరం వద్దే రోడ్డుపై నిద్రించి నిరసన తెలిపారు.