ఏన్కూర్ గురుకుల పాఠశాలలో ఉచిత ఫిజియోథెరపీ క్యాంప్
KMM: సింగరేణి మండలంలో పుట్టి, ఏన్కూర్ గురుకుల పాఠశాలలో చదువుకున్న బాదావత్ రవి, తన పాఠశాల విద్యార్థులకు, స్థానికులకు సేవ చేయాలనే సంకల్పంతో ఉచిత ఫిజియోథెరపీ క్యాంపును ఆదివారం నిర్వహించారు. మిషన్ వాక్ ఫౌండేషన్ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో సుమారు 500 మంది రోగులకు కండరాల, నరాల నొప్పులకు ఉచితంగా చికిత్స అందించి అందరి మన్ననలు పొందారు.