గుర్తు తెలియని వృద్ధుడు మృతి
ASF: కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ 1వ ప్లాట్ ఫామ్‌పై గుర్తుతెలియని వృద్ధుడు మరణించినట్లు హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ మంగళవారం తెలిపారు. మృతుడి వద్ద కాగజ్ నగర్ నుంచి బల్లార్షా వరకు తీసుకున్న రైల్వే టికెట్ లభించిందన్నారు. అయితే అతను అనారోగ్య కారణంతో మరణించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు.