భాకరాపేట: తమిళ స్మగ్లర్ అరెస్ట్

భాకరాపేట: తమిళ స్మగ్లర్ అరెస్ట్

TPT: భాకరాపేట అటవీ రేంజ్ అధికారులు యల్లమంద సమీపంలో ఎర్రచందనం రవాణాను అడ్డుకున్నారు.రాత్రి కారులో ఎర్రచందనం తరలిస్తుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో కారు కల్వర్టును ఢీకొట్టింది. స్మగ్లర్ అజిత్ కుమార్ మురళి (వేలూరు జిల్లా, తమిళనాడు)ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 5 ఎర్రచందనం దుంగలు (114 కిలోలు), కారు స్వాధీనం చేసుకున్నారు.