‘బీజేపీ సర్కార్ తోనే దేశ అభివృద్ది సాధ్యం’
MNCL: ప్రధాని మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కార్ తోనే దేశ అభివృద్ది సాధ్యమని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల హైటెక్ సిటీ కాలనీలోని తన నివాసంపై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.