డీఆర్‌ఎంతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భేటీ

VSP: విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ పీ. విష్ణుకుమార్ రాజు గురువారం వాల్తేర్ డివిజన్ రైల్వే మేనేజర్ లలిత్ భోహ్రను మర్యాదపూర్వకంగా కలిసారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న రైల్వే సంబంధిత సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ధర్మానగర్, తిక్కవానిపాలెం, గాంధీనగర్ గ్రామాలకు సంబంధించిన ప్రధాన సమస్యలపై వినతిపత్రం అందజేశారు.