నేడు దోర్నాలలో పర్యటించనున్న మంత్రి
ప్రకాశం: రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం దోర్నాలలో పర్యటించనున్నారు. దోర్నాలలోని వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్స్‌ను ఆయన సందర్శిస్తారు. ఇటీవల ‘మొంథా’ తుఫాను ప్రభావంతో ప్రాజెక్టులోకి నీరు చేరిన నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని మంత్రి కార్యాలయం తెలిపింది. మంత్రి రానున్న సందర్భంగా పార్టీ నాయకులు, హాజరవాలని కార్యవర్గం తెలిపింది.