VIDEO: సత్తెనపల్లిలో రూ. 40 లక్షల CMRF చెక్కులు పంపిణీ
PLD: సత్తెనపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు రూ. 40 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం అందజేశారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడంలో సీఎం సహాయ నిధి ఎంతగానో దోహదపడుతోందని కన్నా అన్నారు. అనంతరం లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే కన్నాకు కృతజ్ఞతలు తెలిపారు.