'సొంతింటి కలను ముఖ్యమంత్రి నెరవేర్చారు'
WGL: పేద ప్రజల సొంతింటి కలను ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధ్యం చేశారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ 25వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వంలో ఇళ్ల కోసం ప్రజలు ఎదురు చూశారని అన్నారు. ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి విడుతల వారిగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని తెలిపారు.