15 రోజుల్లోనే ఓటరు గుర్తింపు కార్డులు జారీ!

NLG: ఓటర్లకు ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డు (EPIC) అందడానికి పడుతున్న సమయాన్ని ఎన్నికల సంఘం(EC) కుదించింది. ఓటర్ల జాబితాలో నవీకరణ జరిగిన 15రోజుల్లోపు ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను అందజేసేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఈసీ తెలిపింది. కొత్త నమోదు లేదా ఇప్పటికే ఉన్న ఓటరు వివరాలలో మార్పు చేసిన 15రోజుల్లోగా కొత్త ఓటరు కార్డు జారీ చేయనున్నారు.