VIDEO: పెద్దపులి దాడి.. 3 దూడలు మృతి

VIDEO: పెద్దపులి దాడి.. 3 దూడలు మృతి

ASR: దేవీపట్నం మండలం కొత్త వీధి గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం స్థానికుల్లో భయాందోళన కలిగిస్తోంది. గురువారం రాత్రి పెద్దపులి దాడిలో మూడు దూడలు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మరో గేదె కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. ఇదే మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.