'చెరువులు కలుషితం కాకుండా చూడాలి'
AKP: అచ్యుతాపురం మండలం దుప్పితూరులో సాగునీటి చెరువును సోమవారం ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు పరిశీలించారు. సాగునీటి చెరువులు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. చెరువులు కలుషితమైతే వాటిలో నీటిని తాగుతున్న పశువులు అనారోగ్యానికి గురవుతాయన్నారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా కాపాడాలన్నారు.