ప్రధాన రహదారి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు

ప్రధాన రహదారి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు

KRNL: బైచిగేరి క్రాస్‌ నుంచి కపటి మీదుగా పెద్దకడబూరు వరకు వెళ్లే ప్రధాన రహదారి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గత ప్రభుత్వంలో గుంతలతో దారుణంగా మారిన ఈ రోడ్డుకు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ప్రయత్నంతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రూ.6.40 లక్షలు ఆమోదించారు. త్వరలో పనులు ప్రారంభమవనున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు ఉషారాజు తెలిపారు.