మల్లంపేటలో సూర్యఘర్ పథకం ప్రారంభం

మల్లంపేటలో సూర్యఘర్ పథకం ప్రారంభం

BPT: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దొనకొండ మండలం మల్లంపేట కాలనీలో పీఎం సూర్యఘర్ ఉచిత సోలార్ విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత కనెక్షన్‌లు అందిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రానికి 20 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు మంజూరయ్యాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.