విద్యుత్ షాక్‌తో వ్యక్తికి స్వల్ప గాయాలు

MNCL: జిల్లా కేంద్రంలోని లక్ష్మీ టాకీస్ సమీపంలో శనివారం రాత్రి ఓ భవనంపై ఫ్లెక్సీ కడుతుండగా, 11 కెవి విద్యుత్ లైనుకు తగలడంతో మందమర్రికి చెందిన రామ్ శ్రీకాంత్ అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.