మిత్రుని కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు

మిత్రుని కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు

NRML: మామడ మండలంలోని కొరిటికల్ గ్రామానికి చెందిన చుక్కల నారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆయనతోపాటు 1993-94 సంవత్సరంలో పదవ తరగతి చదివిన బ్యాచ్ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం ఆర్థిక సాయంగా రూ.30 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జోగు శ్రీను, రవి, రంజిత్ ఉన్నారు.