దేవరపల్లిలో చెత్త కుప్పలతో అవస్థలు పడుతున్న ప్రజలు
E.D: దేవరపల్లిలోని కొత్తపేట - పాత పేటకు వెళ్లే ప్రధాన రహదారిలో చెత్త పేరుకుపోయిందని స్థానికులు అవేదన వ్యక్తం చేశారు. అదే దారిలో పాఠశాల ఉండడంతో విద్యార్థులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అధికారులకు ఎన్ని సార్లు సమస్యను తెలిపినా పట్టించుకోవట్లేదని వాపోయారు. వెంటనే స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని కోరారు.