VIDEO: మియాపూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
RR: మియాపూర్ సర్వే నెంబర్ 100లో జరిగిన భారీ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు HMDA, హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగారు. నిర్మాణదారులు HMDA ఫెన్సింగ్‌ను తొలగించి, సర్వే నెంబర్‌ను అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 307, 308గా మార్చి పర్మిషన్లు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మోహరించారు.