VIDEO: బోలే సాబ్ దర్గా ఉత్సవాల్లో భారీ ధ్వజం ఆవిష్కరణ
SRD: కంగ్టి మండలం దెగులవాడి గ్రామంలో మంగళవారం సాయంత్రం బోలె సాబ్ దర్గా వద్ద భారీ ధ్వజాన్ని ఆవిష్కరించారు. గత మూడు రోజుల నుంచి జరుగుతున్న బోలె సాబ్ దర్గా జాతర ఉత్సవాల్లో గత శుక్రవారం ధ్వజం జెండాను కిందకు దించారు. ఇవాళ గ్రామస్తులు కులమతాలకు అతీతంగా అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారంగా భారీ ధ్వజాన్ని తాళ్ల సహాయంతో పైకెత్తి జెండాను ఎగురవేశారు.