మంత్రి తుమ్మలను కలిసిన కాంగ్రెస్ నాయకులు

KMR: బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. యూరియా కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. సకాలంలో యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి వివరించారు. రూ.2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేయాలని కోరారు.