రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన పీపీఆర్ గ్రూప్ సభ్యులు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన ఓ మహిళకు O+ పాజిటివ్ రక్తం అవసరమైంది. సమాచారం తెలియడంతో పీపీఆర్ గ్రూప్ సభ్యులు, పందెం ప్రతాప్ రెడ్డి, నవీన్ యాదవ్ సహకారంతో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఇది నవీన్ యాదవ్ 13వ రక్తదానం కావడం విశేషం. ఈ కార్యక్రమంలో పీపీఆర్ సోషల్ సర్వీస్ గ్రూప్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.