VIDEO: 'పారాక్వాట్ హర్బిసైడ్‌పై పూర్తి నిషేధం విధించాలి'
WGL: దేశవ్యాప్తంగా తీవ్ర ఆరోగ్య మరియు పర్యావరణ ప్రమాదాలకు కారణమవుతున్న పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు)పై తక్షణమే పూర్తి నిషేధం విధించాలని WGL MP కడియం కావ్య లోక్‌సభలో డిమాండ్ చేశారు. శుక్రవారం జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన MP, ఈ హర్బిసైడ్ వల్ల నేల, నీరు, ఇసుక తీవ్రంగా కాలుష్యం అవుతున్నాయని, వ్యవసాయ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.