VIDEO: 'జడ కొప్పు' వేడుకల్లో పాల్గొన్న సీపీ సాయి చైతన్య

VIDEO: 'జడ కొప్పు' వేడుకల్లో పాల్గొన్న సీపీ సాయి చైతన్య

NZB: ఉగాది పండుగను పురస్కరించుకుని రెంజల్ మండలం దూపల్లిలో నిర్వహించిన 'జడ కొప్పు' కోలాట వేడుకల్లో CP సాయి చైతన్య పాల్గొన్నారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ సంస్కృతిని, ప్రాచీన కళలను కాపాడుతున్న గ్రామ అభివృద్ధి కమిటీని, భక్తిశ్రద్ధలతో కోలాట ప్రదర్శన చేసిన సభ్యులను అభినందించారు.