పక్కాగా డాక్యుమెంట్‌లో ఉండాలి: రేవంత్ రెడ్డి

పక్కాగా డాక్యుమెంట్‌లో ఉండాలి: రేవంత్ రెడ్డి

TG: తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించాలని అధికారులకు సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి, పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా విభజించాలన్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి ఉండాలో డాక్యుమెంట్‌లో పొందుపర్చాలన్నారు.