నేడు మట్టి వినాయక విగ్రహాల తయారీ పోటీలు

నేడు మట్టి వినాయక విగ్రహాల తయారీ పోటీలు

ATP: వినాయక చవితిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యా ర్థులకు శనివారం 'మట్టి వినాయక విగ్రహాల తయారీ' పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో ప్రసాద్ బాబు, కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ పీవీ కిషోర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు అనంతపురంలోని శారదా నగర పాఠశాలలో పోటీలు ప్రారంభమవుతాయి.