కారు ఢీ.. ఒకరు స్పాట్ డెడ్

కారు ఢీ.. ఒకరు స్పాట్ డెడ్

KMR: బాన్సువాడ మండలం కొయ్య గుట్ట తండా వద్ద మంగళవారం కామారెడ్డి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాకు చెందిన భార్యాభర్తలు కేతవత్ వసురం, బూరీ బాయి టీవీఎస్‌పై వెళ్తుండగా కామారెడ్డి వైపు నుంచి వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో కేతావత్ వసురం అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.