VIDEO: ఇంద్రవెల్లి మండలంలో పర్యటించిన ఆత్రం సుగుణ

ADB: ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ పర్యటించారు. వరద పరిస్థితులను అంచనా వేశారు. ముత్తునూర్ గ్రామంలో పలువురి ఇళ్లలోకి వరదనీరు చేరడంతో అక్కడి బాధితులను పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక అధికారులతో మాట్లాడారు. ప్రాణహానికీ గురికాకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టాలన్నారు.